ఇకనైనా అధికారులు అలసత్వం వీడండి : రెడ్యానాయక్

by  |
ఇకనైనా అధికారులు అలసత్వం వీడండి : రెడ్యానాయక్
X

దిశ, డోర్నకల్ :
అధికారులు అలసత్వం వీడి క్షేత్ర స్థాయిలో పర్యటించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మీరు సమావేశాలకు రాకుండా ఉంటే సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం డోర్నకల్ మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఎంపీపీ బాలు నాయక్ అధ్యక్షతన జరిగింది. అందులో భాగంగా ఇటీవల దేశ సరిహద్దుల్లో అసువులు బాసిన కల్నల్ సంతోష్ మృతికి సభ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జరిగిన సమావేశంలో మండలంలోని గొల్లచర్ల, తెల్లబండ తండా, చిలుకోడు, మోత్తుగడ్డ తండా గ్రామ పంచాయతీలో మిషన్ భగీరథ నీరు రావడం లేదని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే చేసి ప్రతి గ్రామం, తండాకు భగీరథ నీరందించకుంటే ఊరుకోనేది లేదంటూ సంబందిత శాఖ ఏఈ, డీఈలపై ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దారు శ్రీకాంత్, ఎంపీపీ బాలు నాయక్, జెడ్పీటీసీ కమల రామనాధం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story