టీచర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే

by  |
టీచర్ అవతారమెత్తిన ఎమ్మెల్యే
X

దిశ, ఖమ్మం రూరల్​: ఖమ్మం నగరంలోని 59వ డివిజన్​లో గల మహిళా గురుకుల పాఠశాలను పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వడ్డించాలని సూచించారు. విద్యార్ధులకు అందిస్తున్న మెనూ, తదితర సౌకర్యాల గురించి పాఠశాల ప్రిన్సిపల్​ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం సంవత్సరానికి లక్షల రూపాయలను ఖర్చు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అంతకుముందు పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే కందాలకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రూరల్​ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్​, మండలపార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, కార్పొరేటర్ బట్టపొతుల లలిత, నాయకులు రవి, సతీష్​, కృష్ణ ​, క్రిష్ణారావు, రామరావు తదితరులు ఉన్నారు.

విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఎమ్మెల్యే కందాల

ఖమ్మం నగరంలోని 59వ డివిజన్​లో గల మహిళా గురుకుల పాఠశాలను పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం విద్యార్ధులకు పాఠాలు నేర్పించి అధికారులను సైతం ఆశ్చర్యపరిచారు. విద్యను ఎలా అభ్యసించాలో తదితర మెళుకువలను విద్యార్థులకు సూచించారు. తప్పకుండా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed