రాబోయే ఎన్నికల్లో పార్టీ కమిటీలే కీలకం

by  |
రాబోయే ఎన్నికల్లో పార్టీ కమిటీలే కీలకం
X

దిశ, పాలేరు: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు నియమించే పార్టీ గ్రామ, జిల్లా, రాష్ట్ర కమిటీలే కీలకమని కమిటీ కన్వినర్లు తెరాస రాష్ట్ర పార్టీ కార్యదర్శులు నూకల నరేష్ రెడ్డి, తాత మధులు అన్నారు. బుధవారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ ఎన్నికల పరిశీలకులుగా వారు పాల్గోని పార్టీ కమిటీల ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 12వ తారీఖు వరకు గ్రామ, మండల కమిటీల నియామకం పూర్తి చేయాలని మండల నాయకులకు సూచించారు. కమిటీల ఎంపికలో ఏమైనా తేడాలు ఉంటే ఎమ్మెల్యే సూచనలు తీసుకోవాలని సూచించారు. ఏ కమిటీ అయినా చెల్లుబాటు కావాలంటే 51 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు ఉండాలని స్పష్టం చేశారు. పార్టీలో క్రియాశీల సభత్వం ఉన్నవారినే పార్టీ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవాలని సూచించారు. పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలు, సోషల్ మీడియా ప్రతినిధులను నియమించాలని ఆదేశించారు. ఇప్పుడు ఎన్నుకోబడే కమిటీలు రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర వహించి తెరాస అధికారంలోకి రావడానికి ఉపయోగపడతాయన్నారు.

గ్రామాల్లో పార్టీకి సమయం కేటాయించి చురుగ్గా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్ష పార్టీల విమర్శలను తగు రితిలో తిప్పికొట్టే వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్రియాశీలకంగా సమర్దవంతంగా పని చేసే నాయకులకు మండల, జిల్లా,రాష్ట్ర కమిటీల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. గత సంవత్సరం రాష్ట్రంలోనే పాలేరు నియోజకవర్గం సభ్యత్వాలలో తొలి స్థానం సాధించిందని.. ఈ సారి కూడా ఇచ్చిన గడువులోనే గ్రామ, మండల కమిటీలతో పాటు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకోని మరణించిన వారికిపార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ ద్వారా 2 లక్షల రూపాయల చెక్కులు అందించడంతో పాటు వారి కుటుంబాలను కలిసి వారికి ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే కందాల మాట్లాడుతూ.. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, ప్రజాసేవ చేసుకుంటూ ముందుకు వెళ్తానని, పార్టీ హైకమాండ్ నిర్ణయం శిరోధార్యమన్నారు. ఖమ్మం రూరల్ పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు మాట్లాడుతూ.. మాజీ పాలేరు నియోజకవర్గానికి జిల్లా, రాష్ట్ర స్థాయి పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని, ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శులను కోరారు.


Next Story

Most Viewed