మంత్రిఫై ఎమ్మెల్యే ఫైర్

by  |
మంత్రిఫై ఎమ్మెల్యే ఫైర్
X

దిశ, వరంగల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్సారెస్పీ రివ్యూ మీటింగ్‌లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య పరస్పర మాటల యుద్ధం నడిచింది. స్థానిక ఎమ్మెల్యే రాకుండా మీ అంతట మీరే రివ్యూ పెట్టుకుంటే ఎలా, స్థానిక సమస్యలు మీకు తెలుసా.. నాకు తెలుసా అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ మండిపడ్డారు. రివ్యూ మీటింగ్ అంటే కేవలం ఫోటోలు దిగి, మీటింగ్ ముగించడమేనా..? అంటూ ఎమ్మెల్యే అధికారులపై‌ ఆగ్రహం వ్యక్తం ‌చేశారు. మంత్రి జోక్యం చేసుకుని సర్థి చెప్పే ప్రయత్నం ‌చేయగా అనవసర రాద్దాంతం ఎందుకు..? మీరు మాట్లాడితే కరెక్ట్… మేము మాట్లాడుతున్నది తప్పంటే ఎలా ఎమ్మెల్యే ‌విసుగ్గున్నారు. ఈ మేరకు స్పందించిన కలెక్టర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు క్షమాపణ చెప్పడంతో ఆయన శాంతించారు.

Next Story