బీజేపీ నేతల పద్ధతి బాగోలేదు.. ఎమ్మెల్యే బొల్లం మలయ్య ఆగ్రహం

by  |
MLA Bollam Mallaiah Yadav
X

దిశ, కోదాడ: రాష్ట్రంలో బీజేపీ నేతలు మోసపూరితమైన యాత్రలు చేస్తున్నారని, బండి సంజయ్ మాటలు నమ్మే పరిస్థితిలో రైతులు లేరని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని దూదియాతండా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. మతాలు, మందిరాల పేరుతో బీజేపీ మత కల్లోహాలు సృష్టించేలా రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే యాసంగిలో పండించే పంటను కొంటున్నామని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం కొనకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. బండి సంజయ్ పొంతనలేని మాటలు మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గరిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.

దేశంలో రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో రైతులకు ఏ బాధా రాకుండా చూసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉండటాన్ని ఓర్వలేని బీజేపీ నేతలు, అనవసరంగా యాత్రలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని తెలిపారు. మీరు ఎన్ని యాత్రలు చేసినా రాష్ట్ర రైతాంగం మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే ఉందని అన్నారు. బండి సంజయ్‌ది అబద్ధాల యాత్ర అని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కొండ సైదయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ సురేష్, పీఏసీఎస్ చైర్మన్ జనార్దన్, మాజీ జెడ్పీటీసీ బట్టు శివాజీ నాయక్, ఎంపీటీసీ కృష్ణచైతన్య, మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు, వాసు, సకురాం, రామాచారి, రాములు, వెంకటేశ్వర్లు, బాలాజీ, శ్రీను, తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed