భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవద్దు.. ఎమ్మెల్యే అరూరి రమేష్

20
ramesh

దిశ, ఐనవోలు: శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అధికారులకు సూచించారు. శుక్రవారం రాత్రి హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, స్నానపు ఘట్టాలను ఆయన ప్రారంభించారు.

అనంతరం జాతరలో పర్యటిస్తూ మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. జాతరకు వచ్చే భక్తులు తప్పకనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు ఆలయ పాలక వర్గం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.