వన్డేల్లో మిథాలీ అరుదైన రికార్డు

by  |
Mithali Raj
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో ఏడు వేల పరుగులు పూర్తి చేసుకొని.. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కింది. ఆదివారం దక్షిణాఫ్రికా జట్టుతో లక్నోలో జరిగిన నాలుగో వన్డేలో మిథాలీ 26 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆ ఘనతను సాధించింది. ఈ మ్యాచ్‌లో మిథాలీ 45 పరుగులు చేసి ఔటయ్యింది. కాగా, గత వన్డేలో అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా, తొలి భారతీయురాలిగా ఆమె రికార్డులకు ఎక్కిన విషయం తెలిసిందే. తాజా ఘనతను ప్రశంసిస్తూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘‘మిథాలీ రాజ్ ఒక అద్బుతమైన క్రికెటర్. వన్డేల్లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచారు. ఆమె ఎంతో ఉత్తమమైన క్రికెటర్’’ అంటూ ప్రశంసించింది. కాగా మిథాలీ తర్వాత 5992 పరుగులతో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్ట్స్ రెండో స్థానంలో ఉన్నది.

Next Story

Most Viewed