షాపింగ్‌కు వెళ్లిన యువతి మిస్సింగ్.. బలరాంపైనే అనుమానం

128

దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని జీవధాన్ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తున్న అశ్విని అనే యువతి అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశ్విని, మరొక అమ్మాయి బాస్మతి కలిసి షాపింగ్ చేయడం కోసం కిసాన్ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో షాపింగ్ మాల్ నుంచి బాస్మతి ఒక్కతే పాఠశాలకు వచ్చింది. అశ్విని ఎక్కడ అని బాస్మతిని అడగగా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లిందని చెప్పగా రాత్రి వరకు ఎదురు చూశారు. ఎంతకీ రాకపోయేసరికి కామారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పాఠశాల ప్రిన్సిపాల్ శిబూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో బలరాం అనే వ్యక్తితో తరుచు అశ్విని తరచుగా మాట్లాడేదని, అతనితోనే వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అశ్విని బయటకు వెళ్ళినప్పుడు రెడ్ కలర్ టాప్, బ్లాక్ కలర్ బాటమ్ ధరించిందని పేర్కొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..