శభాష్ పొలీస్.. నిమజ్జనంలో మిస్సింగ్ బాలుడి ఆచూకీ లభ్యం

by  |
శభాష్ పొలీస్.. నిమజ్జనంలో మిస్సింగ్ బాలుడి ఆచూకీ లభ్యం
X

దిశ, హుజురాబాద్ రూరల్ : వినాయక నిమజ్జనం ఆదివారం రోజున హుజురాబాద్‌లో తప్పిపోయిన బాబు ఆచూకీని మూడు రోజుల పాటు అవిశ్రాంతంగా శ్రమించి ఆచూకీ కనిపెట్టారు పోలీసులు. వరంగల్ అర్బన్ జిల్లా పరకాలలో బాబు ఆచూకీ కనిపెట్టి తల్లికి అప్పగించనున్నారు. కనిపించకుండా పోయిన బాలుడి ఆచూకీని త్వరగా కనిపెట్టడంతో హుజురాబాద్ ప్రజల చేత సీఐ వీరబత్తిని శ్రీనివాస్ శభాష్ అనిపించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. హుజురాబాద్‌కు చెందిన రేకుల భాగ్య కుమారుడు గణేష్(10) వినాయక నిమజ్జనం రోజున హుజురాబాద్‌లో తప్పిపోయాడు. తల్లి పలు ప్రాంతాల్లో వెతికినా గణేష్ ఆచూకీ దొరక్కపోవడంతో మంగళవారం మధ్యాహ్నం హుజురాబాద్ సీఐ వీర బత్తిని శ్రీనివాస్‌ను సంప్రదించింది.

బాబు తప్పిపోయిన విషయాన్ని భాగ్య సీఐకు తెలిపింది. వివరాలు తెలుసుకున్న సీఐ శ్రీనివాస్ వెంటనే స్పందించి నాలుగు బృందాలుగా పోలీసులను బాలుడి ఆచూకీ కోసం పంపించారు. చిన్నబాబు కావడంతో కనీసం ఫోన్ కూడా లేదు. దీంతో సీఐ శ్రీనివాస్‌కు ఒక ఆలోచన వచ్చింది. పాత పద్ధతిలోనే బాబు ఆసక్తిని పెట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బాబు గణేష్ ఫోటోని కాఫీలుగా ప్రింట్ చేసి వరంగల్, కరీంనగర్ జిల్లాలలో అంటించారు. సామాజిక మాధ్యమాలు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో కూడా బాబు వివరాలు పోస్ట్ చేశారు. చివరగా వరంగల్ అర్బన్ జిల్లా పరకాలలో బాబు ఆచూకీని కనిపెట్టారు. తమ సిబ్బంది రవి, అరుణ్ సాయంతో బాబుని హుజురాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లికి అప్పగిస్తామని సీఐ శ్రీనివాస్ చెప్పారు. బాబు ఆచూకీ కనిపెట్టిన హుజరాబాద్ సీఐ శ్రీనివాస్‌తో పాటు సిబ్బందికి గణేష్ తల్లి భాగ్య కృతజ్ఞతలు తెలిపింది. బాబు ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు చూపిన సమయస్ఫూర్తి, శ్రద్దలను పలువురు కొనియాడారు.


Next Story

Most Viewed