భద్రాచలానికి తప్పిన ముప్పు.. కానీ భయం గుప్పిట్లో పట్టణ ప్రజలు..

by  |
bhadrachalam temple
X

దిశ, భద్రాచలం : రెండవ ప్రమాద హెచ్చరిక 48 అడుగులు మించి ప్రవహించిన గోదావరి ఆదివారం క్రమేపీ తగ్గడంతో భద్రాచలం పట్టణ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల జోరుగా కురిసిన వర్షాల మూలంగా ఎగువ ప్రాంతంలో జలాశయాల నుంచి వదిలిన నీటి మూలంగా భద్రాచలం వద్ద శనివారం గోదావరి పరవళ్ళు తొక్కింది. దీంతో శనివారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక, సాయంత్రం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

అయితే అర్థరాత్రి నుంచి నిలకడగా ఉన్న గోదావరి ఆదివారం తెల్లవారుజాము నుంచి తగ్గుముఖం పట్టడంతో రెండు ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. ఇలా వరద ముప్పు తప్పడంతో భద్రాచలం పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మళ్ళీ వర్షాలు వచ్చినా, దిగువన ఉన్న పోలవరం ప్రాజెక్టు నిండినా భద్రాచలం వద్ద వరదపోటు తప్పదని భయం గుప్పిట్లో పట్టణ ప్రజలు ఉన్నారు. శనివారం 48.60 అడుగులు ఉన్న గోదావరి ఆదివారం సాయంత్రం 4 గంటలకు 42.20 అడుగులకు తగ్గింది.

Next Story

Most Viewed