యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి తలసాని

by  |
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి తలసాని
X

దిశ, యాదగిరిగుట్ట: తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కూడా దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనలు అందజేయడం జరిగింది. యాదాద్రి ఆలయాన్ని సందర్శించి పునఃనిర్మాణ పనుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం హరిత హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. యాదాద్రి అద్భుత కళాకాండంగా అభివర్ణిస్తూ తిరుపతి దేవాలయం స్థాయిలో యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. సకల సౌకర్యాలతో ఆలయం నిర్మాణం జరుగుతోందన్నారు. యాదాద్రి నిర్మాణం పూర్తయ్యాక శబరిమల మాదిరిగా 40 రోజుల దీక్ష చేసుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే హుజురాబాద్ ఉపఎన్నికల‌‌లో భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు. తమ పార్టీ యువతకు పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రవేశ పెట్టిందని రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశానికే ఆదర్శమని తెలిపారు. దళిత బంధు పథకం వాసలమర్రి‌లో లాంఛనంగా ప్రారంభించామని రాష్ట్రం మొత్తం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని అన్నారు.

Next Story