- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ రాజధానిపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు.. ఉత్తరాంధ్రుల ఆగ్రహాన్ని చూస్తారా..?
ఏపీ రాజధానిపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు.. ఉత్తరాంధ్రుల ఆగ్రహాన్ని చూస్తారా..?

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ రాజధానిపై మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకుండా అమరావతి రైతులు అడ్డుకుంటే ఉత్తరాంధ్ర ఉద్యమిస్తుందన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చంద్రబాబు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం మూడు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతోందన్నారు.
చంద్రబాబు అమరావతి రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహాన్ని చవి చూడక తప్పదన్నారు. కాగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. మరికొన్ని మార్పులు చేసి మరోసారి ఆ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామన్నారు.
Next Story