ఎలుకలు కొట్టిన డబ్బులు ఇప్పిస్తా.. బాధితుడికి ఫోన్ చేసిన మంత్రి

by  |
Minister Satyavathi Rathod
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వేంనూరు గ్రామ పంచాయితీ పరిధిలోని ఇందిరా నగర్ తండా గ్రామ పంచాయితీకి చెందిన భూక్య రెడ్యా నాయక్ కంతి ఆపరేషన్ నిమిత్తం దాచుకున్న రూ.2 లక్షలును ఎలుకలు కొట్టిన విషయం తెలిసిందే. దీనితో బాధిత రైతు కన్నిటిపర్యంతమవుతున్నాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం రెడ్యా నాయక్‌తో ఫోన్‌లో పరామర్శించారు. పనికిరాకుండా చిరిగిన నోట్లను తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు మహబూబాబాద్ తహశీల్దార్ రంజిత్ బాధితుని ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ఏ ఒక్క రైతు ఇబ్బందులు పడొద్దు అని తెలిపారు.

Next Story

Most Viewed