గ్రామీణ ప్రాంతాలకు కార్గో సేవలు: మంత్రి పువ్వాడ

by  |
గ్రామీణ ప్రాంతాలకు కార్గో సేవలు: మంత్రి పువ్వాడ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమెజాన్ కంపెనీతో సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలోనే ఇప్పందం చేసుకోనున్నట్లు రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కార్గో పార్శిల్ సేవ‌ల ద్వారా ఇప్పటి వ‌ర‌కు రూ. 62.02 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. గురువారం శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ముఠాగోపాల్, అబ్రహం, రఘునందర్ రావు, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, సీతక్కలు ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవ‌ల‌పై అడిగిన ప్రశ్నల‌కు మంత్రి స‌మాధానం చెప్పారు. రాష్ట్రంలో హోం పిక‌ప్, హోం డెలివ‌రీ పార్శిల్ స‌ర్వీసుల‌ను ప్రవేశ‌పెట్టాల‌ని యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 195 కార్గో వాహ‌నాల‌ను ఆర్టీసీ క‌లిగి ఉందని, భ‌విష్యత్‌లో మ‌రో 50 కార్గో వాహ‌నాల‌ను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు.

177 బస్టాండ్లలో 790 మంది ఏజెంట్లతో కార్గో సేవలు అందజేస్తున్నామని తెలిపారు. బ‌ల్క్ వ‌స్తువుల ర‌వాణా కోసం ఓల్డ్ బ‌స్సుల‌ను వినియోగిస్తున్నామని, 10 మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యం క‌లిగిన కార్గో బ‌స్సు,లు 150, 4 మెట్రిక్ ట‌న్నుల సామ‌ర్థ్యం క‌లిగిన కార్గో బ‌స్సులు 35, ఓపెన్ కార్గో బ‌స్సులు 10 ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్‌లు, సూప‌ర్ డీల‌క్స్ బ‌స్సుల్లో కూడా కొరియ‌ర్స్, చిన్న పార్శిల్‌ను ర‌వాణా చేస్తున్నామ‌న్నారు. 30 మంది ప్రయాణికులు ఉంటే వారి వద్దకే బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే కాలంలో 75 కోట్ల నుంచి 100కోట్లు టార్గెట్ అన్నారు.



Next Story

Most Viewed