- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీజేపీతో చంద్రబాబు దోస్తీ.. మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసిసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. టీడీపీ ముసుగులో అమరావతి ఉద్యమం జరుగుతుందని, తమ ప్రభుత్వం మాత్రం 3 రాజధానులకే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కాగా ఇవాళ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో జరిగిన భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు విపక్ష పార్టీల నేతలందరూ హాజరయ్యారు. దీంతో జగన్ ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష, విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చినట్లు అయింది. ఇలాంటి తరుణంలో పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
- Tags
- bjp
- Chandrababu
Next Story