నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి: నిరంజన్‌రెడ్డి

by  |
నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి: నిరంజన్‌రెడ్డి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో విత్తనాల సరఫరా చురుగ్గా జరగాలని, వానలు పడితే రైతులు ఆగే పరిస్థితి ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. వానాకాలం సాగుకు విత్తనాల సరఫరాపై రెడ్‌ హిల్స్‌ ఉద్యాన శిక్షణా కేంద్రంలో గురువారం మంత్రి నిరంజ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు కావాల్సిన మేరకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, విత్తనాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయని క్లస్టర్ల వారీగా ప్రతి రోజూ వివరాలు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రధానమైన విత్తన కంపెనీలతో ప్రతి రోజూ సమాచారం సేకరించాలని, సన్నాలలో తెలంగాణ సోన సాగును ప్రోత్సహించాలన్నారు. మధుమేహం రోగులకు తెలంగాణ సోన మేలుచేస్తుందని, అందుకే ప్రభుత్వం తెలంగాణ సోన సాగును ప్రోత్సహిస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సోనను భారీగా సాగుచేసేలా రైతులను చైతన్యం చేయాలని, ఈ వానకాలంలో 4 లక్షల క్వింటాళ్ల విత్తనాల ఉత్పత్తికి తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ సన్నాహాలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌ రావు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ కేశవులు, అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed