గవర్నర్‌ను కలిసిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి..

by  |
గవర్నర్‌ను కలిసిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి..
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, టీఆర్ఎస్ నేతల బృందం రైతుల కోసం తలపెట్టిన ‘మహాధర్నా’ అనంతరం గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. రైతుల విషయంలో గందరగోళం ఉండవద్దని గవర్నర్ చెప్పారని ఆయన తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో సీఎం కేసీఆర్ మాట్లాడిన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. నిన్నటి వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు. కేంద్రం కొనుగోలు చేసేది కూడా సరిపోదని గవర్నర్‌కు వివరించినట్టు తెలిపారు. ఉత్తర భారతంలో యాసంగిలో వడ్లు వేయరని, యాసంగిలో అయినా వడ్లు కొంటారా లేదా చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. రైతుల విషయంలో కేంద్రం కావాలనే కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందన్నారు.

Next Story

Most Viewed