టీఆర్ఎస్‌కు అసలైన బలం వాళ్లే.. మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
Minister Malla Reddy
X

దిశ, మేడ్చల్ టౌన్: కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్ పట్టణంలోని ఓం శివసాయి ఫంక్షన్ హాల్‌లో మేడ్చల్ మండల టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి అసలైన బలం అన్నారు. వారి కృషి వల్లే పార్టీ నేడు అన్ని విధాలుగా పటిష్టమవుతుందని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఉన్నత స్థాయిలో ఉండటానికి పార్టీ బలం పెరగటానికి కార్యకర్తల కృషినే కారణమని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బలమైన ప్రాంతీయ పార్టీగా దేశంలో పేరు పొందిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి మహేందర్ రెడ్డి, జెడ్పీటీసీ శైలజ విజయానందారెడ్డి, ఎంపీపీ పద్మజగన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ రవి యాదవ్, రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు విజయానందారెడ్డి, యూత్ అధ్యక్షుడు హరత్ రెడ్డి, మండల అధ్యక్షుడు దాయనంద్ యాదవ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, కో-ఆప్షన్ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed