సిరిసిల్లలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు

by  |
Minister KTR phone call
X

దిశ, తెలంగాణ బ్యూరో : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సిరిసిల్ల పట్టణంలో వరద నీరు వచ్చి కాలనీల్లో చేరుతున్నందున సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతి పెరగడంతో పాటు కాలనీలకు భారీగా వరద నీరు వచ్చి చేరిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

వరదలో చిక్కుకున్నటువంటి ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించాలని సూచించారు.సహాయక చర్యల కోసం హైద్రాబాద్ నుంచి డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తున్నామని తెలిపారు. రానున్న 48 గంటల పాటు వర్షపాతం ఉన్నందున వరద మళ్లింపునకు గల అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.

Next Story

Most Viewed