చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్

by  |
Minister Kodali Nani
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రం అనాథనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు హయాంలో అవతరణ దినోత్సవం జరపకుండా కుటిలయత్నాలకు పాల్పడ్డారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో కొడాలి నాని మాట్లాడుతూ ఏపీ అనాథ కాదన్నారు. ప్రజలకు దూరమై చంద్రబాబే అనాథయ్యారన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని స్మరిస్తూ నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్యమైన చంద్రబాబు ఉండటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

Next Story