చేతిలో చెక్కు.. నట్టింట్లో మంత్రి.. అవాక్కైన కుటుంబసభ్యులు

by  |
Minister Jagadish Reddy
X

దిశ, సూర్యాపేట: పేదల ఇంట్లో పెండ్లికి ప్రభుత్వం అందిస్తున్న తాంబూలమే కల్యాణలక్ష్మీ/షాదీముబారక్ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పేందలందరినీ అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. గతంలో పేదింటి ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే.. తల్లిదండ్రులు అష్టకష్టాలు పడేవారని గుర్తుచేశారు. ఆ కష్టాలు ఇక తెలంగాణలో ఎవరూ పడకూడదన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మీ/షాదీముబారక్ పథరాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ పథకాలు పేదలకు వరంగా మారాయన్నారు.

కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఆదాయం పడిపోయినా తెలంగాణా ఇంటి ఆడపడుచులు ఇబ్బంది పడకూడదని, మేనమామ రూపంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న వరమే కల్యాణలక్ష్మీ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్‌‌పహాడ్ మండల పరిధిలోని పలు గ్రామాల కల్యాణలక్ష్మీ లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లబ్దిదారుల వద్దకు స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా.. ఒక్కసారిగా మంత్రి లబ్దిదారుల ఇండ్లకు వెళ్లేసరికి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.



Next Story

Most Viewed