‘కరోనా విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించొద్దు’

by  |
‘కరోనా విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించొద్దు’
X

దిశ, నల్లగొండ: కరోనా వైరస్ విషయంలో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించొద్దనీ, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి, పేదలకు దుస్తులు, బియ్యం, నిత్యావసర సరుకులను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌లతో కలిసి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం కోదాడలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కరోనా తగ్గుముఖం పట్టిందని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రోగ నిరోధక శక్తిని పెంచే బత్తాయి, నిమ్మపండ్లను ఎక్కువగా తినాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలకు, మున్సిపాలిటీ సిబ్బందికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని మంత్రి కోరారు.

Tags: Minister Jagadish Reddy, nalgonda, distributes, essential goods, suryapet

Next Story

Most Viewed