సీతారాముల కల్యాణానికి ముమ్మర ఏర్పాట్లు

by  |
సీతారాముల కల్యాణానికి ముమ్మర ఏర్పాట్లు
X

భద్రాచలంలోని కోదండ రామాలయంలో ఏప్రిల్ 2న సీతారాముల కల్యాణోత్సవం జరుగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.ఆలయంలో విద్యుదీకరణం నుంచి మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని సూచించారు. ఏర్పాట్లలో జాప్యం జరిగినా లేదా అలసత్వం ప్రదర్శించినా వారిపై శాఖాపరమైన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించినట్టు తెలుస్తోంది.

Tags: bhadrachalam, seetharama kalyanam, april 2, minister indrakaran reddy review with officers

Next Story

Most Viewed