'శభాష్ కళ్యాణి' అంటూ.. మంత్రి అల్లోల ప్రశంసలు

by  |
శభాష్ కళ్యాణి అంటూ.. మంత్రి అల్లోల ప్రశంసలు
X

దిశ, ఆదిలాబాద్: ఇంట‌ర్మీడియ‌ట్ సెకండియ‌ర్ ఫ‌లితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్ర‌థ‌మ స్థానంలో ని‌లిచిన కాగ‌జ్ న‌గ‌ర్ నివాసి క‌ళ్యాణిని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌శంసించారు. ఇంతటి ఘనత సాధించిన విద్యార్థిని క‌ళ్యాణిని ప్రోత్స‌హించి వెన్నుత‌ట్టిన విద్యార్థిని త‌ల్లిదండ్రులను ఆయ‌న‌ అభినందించారు. విద్యార్థినితో పాటు విద్యార్థిని త‌ల్లిదండ్రులు అనిత‌- శేష‌గిరిల‌తో మంత్రి అల్లోల శ‌నివారం ఫోన్ లో మాట్లాడారు. క‌ళ్యాణి ఉన్న‌త చ‌దువులు చ‌దివించేందుకు ప్ర‌భుత్వం అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసానిచ్చారు. విద్యార్థిని క‌ళ్యాణి మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని అకాంక్షించారు. చ‌దువుకోవాల‌నే పట్టుదల, తపన, సాధన ఉంటే విజయం తథ్యమ‌ని, పేదరికం అడ్డుకాదని కళ్యాణిని నిరూపించింద‌ని కొని‌యాడారు.

Next Story

Most Viewed