‘30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం’

by  |
‘30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం’
X

దిశ, మెదక్: ఆరో విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలు అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమాన్ని మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో మొక్కలు నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీశ్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed