కొత్త జిల్లాలతో పాలనలో పారదర్శకత

by  |
కొత్త జిల్లాలతో పాలనలో పారదర్శకత
X

దిశ, ఆందోల్: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాలనలో పారదర్శకత పెరుగుతోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం అందోల్- జోగిపేట కొత్త రెవెన్యూ డివిజన్ కార్యాలయం, చౌట‌కూర్ మండల కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితోనే చిన్న జిల్లాల ఏర్పాట్లు అయినట్లు, దీంతో మెరుగైన పాలన అందుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో గతంలో ఒకే రెవెన్యూ డివిజన్‌తో ఇబ్బందులు ఉండేవని.. ప్రస్తుతం నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్- జోగిపేటతో నాలుగు డివిజన్లు ఏర్పాటు అయ్యాయని హరీశ్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జహీరాబాద్ ఎంపీ బి బి పాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story