జర్నలిస్టులు క‌రోనాతో జర జాగ్ర‌త్త‌ : ఎర్రబెల్లి

by  |
జర్నలిస్టులు క‌రోనాతో జర జాగ్ర‌త్త‌ : ఎర్రబెల్లి
X

దిశ , వ‌రంగ‌ల్: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా విస్తరించడంతో పాటు ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులు విధినిర్వహణలో జాగ్ర‌త్త‌గా ఉండి, స్వీయ నియంత్ర‌ణ‌ పాటిస్తూ..తమ క‌ర్త‌వ్యాల‌ను నిర్వర్తించాలని మీడియా మిత్రుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సూచించారు. ప్ర‌పంచాన్ని కరోనా వణికిస్తున్న నేప‌థ్యంలో అనేక మంది విలేక‌రులు, మీడియా మిత్రులు క‌రోనా బారిన పడుతున్నారని చెప్పారు. హైద‌రాబాద్, వ‌రంగ‌ల్, ఇత‌ర ప్రాంతాల్లో విధినిర్వహణలో భాగంగా వెళుతున్న జర్నలిస్టులకు టెస్టులు నిర్వహించగా పాజిటివ్ వస్తోందని వివరించారు. అయితే ఎవరూ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని, వాళ్ళ‌ని ర‌క్షించ‌డానికి త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామన్నారు. కాకపోతే లక్షణాలు బయట పడిన వారు వెంటనే క్వారంటైన్ లోకి వెళ్లాలన్నారు. అలాగే, ఎవరికీ వారు స్వీయ నియంత్ర‌ణ‌ పాటిస్తే ఈ మహమ్మారి నుంచి మనల్ని, మన కుటుంబాలను రక్షించుకున్నావారము అవుతామని మంత్రి తెలిపారు.

Next Story

Most Viewed