రైతు వేదిక‌ల ప‌నుల్లో వేగం పెంచాలి

by  |
రైతు వేదిక‌ల ప‌నుల్లో వేగం పెంచాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 2,601 రైతు వేదిక‌ ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని మంత్రి ఎర్రబెల్లి అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే రైతు వేదిక‌లు సగానికి పైగా పూర్త‌య్యాయ‌ని, మిగ‌తా స‌గం ప‌నులు వివిధ ద‌శ‌ల్లో ఉన్నాయ‌న్నారు. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల ప‌నుల ప్ర‌గ‌తి, రైతు వేదిక‌లు, క‌ల్లాలు, పీఎంజీఎస్‌వై రోడ్ల ఆన్ గోయింగ్ ప‌నుల‌ సమీక్షలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో లక్ష క‌ల్లాల‌ను నిర్మించాల‌ని నిర్ణ‌యించామ‌ని, వాటిని గ్రౌండ్ చేయాల‌న్నారు. వ‌ర్షాకాల పంట‌లు చేతికొచ్చే స‌మ‌యం వ‌చ్చినందున‌ రైతుల‌తో మాట్లాడి క‌ల్లాల‌ను వెంట‌నే చేప‌ట్టి, త్వరితగతిన పూర్తి కావాలన్నారు. పీఎంజీఎస్‌వై ఫేజ్-3 కింద రాష్ట్రానికి రూ.658 కోట్ల అంచ‌నా వ్య‌యంతో 2,427.5 కి.మీ రోడ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేసిందని, వాటిలో బ్యాచ్ -1 కింద 1,119.94 కి.మీ.కు 152 ప‌నులు మంజూరు అయ్యాయని, ఈ ప‌నుల‌కు టెండ‌ర్లు ముగిశాయని, త్వరిత‌గ‌తిన ఈ ప‌నుల‌ను చేప‌ట్టి స‌కాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాచ్ -2 కింద మిగిలిన 1,308 కి.మీ. రోడ్ల‌కు ప్ర‌తిపాద‌న‌లను, పీఎంజీఎస్‌వై నిబంధ‌న‌ల ప్ర‌కారం పూర్తి చేసి, వెంట‌నే కేంద్రానికి పంపి, వాటి క్లియ‌రెన్స్ తీసుకోవాల‌న్నారు.

Next Story

Most Viewed