ఐక్యంగా పోరాడి కరోనాను కట్టడి చేశారు: ఎర్రబెల్లి

by  |
ఐక్యంగా పోరాడి కరోనాను కట్టడి చేశారు: ఎర్రబెల్లి
X

దిశ, వరంగల్: ప్రజలు ఐక్యంగా పోరాడి కరోనా వైరస్‌ను కట్టడి చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు, క‌రోనా క‌ట్ట‌డిలోనూ సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను చూసి దేశం హర్షిస్తున్నదని కొనియాడారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, వరంగల్ ఎంపీ ప‌సునూరి దయాకర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయినప్పటికీ ప్రజల ప్రాణాలే ముఖ్యమంటూ కేసీఆర్ ధైర్యం కోల్పోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేంతవరకూ గ్రామాల్లో దాతలు స్పందించి పేదలను ఆదుకోవాలని కోరారు. బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. మరో ఏడాది వరకూ కరోనా ఎఫెక్ట్ ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. కరోనా వైర‌స్ నియంత్రణ చర్యల్లో గ్రామాలు సక్సెస్ అయ్యాయని తెలిపారు.

Tags: Minister Errabelli Dayakar Rao, distributes, essential goods, poor people, warangal, corona, mp pasunuri dayakar rao

Next Story

Most Viewed