పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి : మంత్రి అల్లోల

by  |

దిశ, అదిలాబాద్: రాష్ట్రంలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. విశాఖ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అస్వస్థతకు గురైన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. విశాఖ దుర్ఘ‌ట‌న నేప‌థ్యంలో రాష్ట్రంలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాలని కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి సభ్య కార్యదర్శి నీతూ ప్రసాద్‌ను ఆదేశించారు.

Tags: Adilabad,Industries,Minister Indra karan reddy,Safety standards

Next Story

Most Viewed