కేంద్రం దిగి వచ్చే వరకు చావు డప్పు: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

by Sridhar Babu |   ( Updated:2021-12-20 07:04:42.0  )
కేంద్రం దిగి వచ్చే వరకు చావు డప్పు: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
X

దిశ, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న అనుచిత విధానాలపై తెరాస రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల కేంద్రంలో నిరసనలు నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. రైతులకు న్యాయం జరిగే వరకు, కేంద్రం దిగివచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు మోగించాలని పిలుపునిచ్చారు.

కేంద్రం అవలంబించే రాష్ట్ర వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. కేంద్రం వచ్చే యాసంగిలో ఉప్పుడు బియ్యం కొనమని చెప్పిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు.

Advertisement

Next Story

Most Viewed