నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి

by  |
నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి
X

దిశ, సికింద్రాబాద్: ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రహదారుల విస్తరణ పనులను చేపట్టిందని మంత్రి తలసాని అన్నారు. రహదారుల విస్తరణలో భూములు, భవనాలు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటుందన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సుమారు రూ. ౩ కోట్లతో రహదారి విస్తరణ, నూతన డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణ పనులు కూడా చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ హేమలత, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాస రావు, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సీపీ ప్రసాద్, ఏసీపీ కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed