కనీస మద్దతు ధర కొనసాగుతుంది: మోడీ

by  |
కనీస మద్దతు ధర కొనసాగుతుంది: మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: రైతుల పంటలకు కనీస మద్దతు ధర కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. మధ్య ప్రదేశ్‌లో కిసాన్ కళ్యాణ్ పథకాన్ని ప్రధాని మోడి శుక్రవారం ప్రారంభించారు. రైతులను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… మధ్యప్రదేశ్‌లో 35 లక్షల మంది రైతులకు రూ.16వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. గిడ్డంగుల సదుపాయం రైతులకు అతి ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు.

గోదాముల సామర్థ్యం పెంపుపై దృష్టి సారించామని తెలిపారు. రైతులందరికీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. రైతులను తప్పుదోవ పట్టించడాన్ని విపక్షాలు మానుకోవాలని సూచించారు. రైతుల కష్టాలపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని అన్నారు. . గత ప్రభుత్వం కంటే మద్దతు ధర ఎక్కువగా ఇస్తున్నామని తెలిపారు. రైతులకు ఆధునిక సౌకర్యాలు మరింత అవసరమని ఆయన అన్నారు.

Next Story