ట్రక్కును ఢీ కొట్టిన మినీ బస్సు.. 15 మంది మృతి

104

దిశ,వెబ్‌డెస్క్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో ట్రక్కును మినీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు.

కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరింది. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ఉన్నట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. మృతులంతా వ్యవసాయ కూలీలని తెలుస్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..