IT సంచలనం.. త్వరలోనే మార్కెట్లోకి Windows-11 ఆపరేటింగ్ సిస్టమ్..?

by  |
IT సంచలనం.. త్వరలోనే మార్కెట్లోకి Windows-11 ఆపరేటింగ్ సిస్టమ్..?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ మరో సంచలనానికి తెరలేపింది. ప్రస్తుత IT మార్కెట్లో Microsoft ఆవిష్కరణ Windows-10 రారాజుగా కీర్తించబడుతోంది. అయితే, త్వరలోనే దీనికి సీక్వెల్ (Update Version) తీసుకురానున్నట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించి కొంత కాలంగా పని చేస్తున్నట్లు తెలిపింది. ఈనెల (జూన్-2021) చివరాఖరులో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను చూడగలమని కంపెనీ ఇటీవల వెల్లడించింది.

2015లో విండోస్-10 ప్రారంభమైనప్పటి నుండి అతిపెద్ద నవీకరణ(Update)గా చెప్పబడింది. దీని లక్షణాలు మరియు వినియోగదారు ఇంటర్‌ఫేస్ వంటి అంశాల్లో గణనీయమైన అప్డేట్స్ ఇందులో చేశారు.

సన్ వ్యాలీయే విండోస్-11 అని పిలువబడుతుందా..?

విండోస్-11(Operating system)కు అధికారికంగా పేరు పెట్టనప్పటికీ , కొత్త విండోస్-10 వెర్షన్ (21 హెచ్ 2)ను మైక్రోసాఫ్ట్ ఇంటర్నల్ సాంకేతికనామం అయిన సన్ వ్యాలీ నవీకరణగా కూడా సూచిస్తారు. సన్‌వ్యాలీ ప్రాజెక్ట్ అనేది విండోస్-10 కు కొత్త స్టార్ట్ మెనూ మరియు టాస్క్‌బార్ లే అవుట్, చిహ్నాలు, శబ్దాలు, డిజైన్స్ అండ్ ఫ్లూయిడ్ యానిమేషన్లను ఇస్తుంది. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ విండోస్ యాప్ స్టోర్‌ను పునరుద్ధరించగలదని కూడా పేర్కొనబడింది.ఇదిలాఉంటే, టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ (vevleaks) మైక్రోసాఫ్ట్ విండోస్-11 అనేది కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుందని సూచించింది.

ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ జూన్ 24న కొత్త విండోస్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇందులో కంపెనీ “తదుపరి తరం విండోస్” (Next generation)ను ప్రారంభించనుంది. కంపెనీ సీఈఓ సత్య నాదెల్ల గతంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ భవిష్యత్తు కోసం టీజర్‌ను బిల్డ్-2021లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

‘డెవలపర్లు మరియు సృష్టికర్తలకు ఎక్కువ ఆర్థిక అవకాశాన్ని సృష్టించేందుకు గత దశాబ్ద కాలంగా ఉన్న విండోస్‌కు ముఖ్యమైన అప్‌డేట్ ఒకదాన్ని త్వరలో పంచుకుంటాము’ అని నాదెల్లా స్పష్టంచేశారు. జూన్-24న జరిగే కార్యక్రమంలో సీఈవో సత్య నాదెల్లా, మైక్రోసాఫ్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పనోస్ పనాయ్‌లు పాల్గొననున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed