నిధి గెలుచుకునే.. రియల్ ట్రెజర్ హంట్

by  |
నిధి గెలుచుకునే.. రియల్ ట్రెజర్ హంట్
X

దిశ, వెబ్‌డెస్క్ : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘గోదావరి’ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో పాపికొండల యాత్ర (రాజమండ్రి నుంచి భద్రాచలం) సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఈ యాత్రలో భాగంగా అక్కడక్కడా హాల్టింగ్ ఉంటుంది. అందులో ఓ చోట ‘ట్రెజర్ హంట్’ ఉంటుంది. ఇచ్చిన ‘క్లూస్’ ఆధారంగా ‘నిధి’(లక్ష్మీ విగ్రహం) ఎవరికి దొరికితే వారే విజేత. గోదావరి సినిమా, ట్రెజర్ హంట్ సంగతులు ఇప్పుడెందుకంటే.. మిచిగాన్‌కు చెందిన ఓ జ్యువెలరీ షాప్ యజమాని ఇప్పుడు సేమ్ ఇలానే ఓ ట్రెజర్ హంట్ ప్రారంభిస్తున్నాడు.

కరోనా ప్రభావం మిచిగాన్‌కు చెందిన జ్యువెలరీ షాప్ ఓనర్ మీద కూడా పడింది. కొవిడ్ వల్ల వ్యాపారంలో నష్టం వాటిల్లి, అంతా తలికిందులు కావడంతో.. జానీకి రెండు ఆప్షన్లే మిగిలాయి. ఒకటి షాప్‌తో సహా ఉన్న నగలన్నింటినీ అమ్మేసి.. రిటైర్ అయిపోవడం. రెండు ఆ నగలతో డబ్బులు వచ్చే మరో వ్యాపారం చేయడం. అయితే, జానీ రెండో ఆప్షన్ ఎంచుకుని, అందుకోసం ‘ట్రెజర్ హంట్’ను ప్రారంభిస్తున్నాడు. దీనికీ కారణం లేకపోలేదు.. ఇటీవలే రాకీ పర్వత ప్రాంతంలో.. ‘ఇన్ ఫేమస్ ఫారెస్ట్ ఫెన్ ట్రెజర్’‌ను ఎన్నో సంవత్సరాల తర్వాత ఒకరు కనిపెట్టారు. దీని నుంచి స్ఫూర్తి పొందిన జానీ.. ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు.

విలువెంత?
1 మిలియన్ డాలర్ల విలువైన నగలు, వజ్రాలు, ఇతర వెండి ఆభరణాలను అతను డెట్రాయిట్ నుంచి పెనిన్సులా వరకు దాచిపెట్టాడు. వాటికి సంబంధించిన క్లూస్ కూడా సిద్ధం చేసి, దీనికి ‘జానీ ట్రెజర్ క్వెజ్’ అనే పేరు పెట్టాడు. వెబ్‌సైట్‌లోనూ ఇదే పేరుతో ఉంది. రియల్ ట్రెజర్ హంట్ కోసం 1 మిలియన్ డాలర్ల విలువైన నగలను 12 భాగాలుగా విభజించి, 12 డిఫరెంట్ ప్లేసుల్లో దాచిపెట్టి రియల్ హంట్‌ను ప్రారంభిస్తున్నాడు. ట్రెజర్ హంట్‌కు సంబంధించిన క్లూస్, రూల్స్ అన్నీ కూడా ట్రెజర్ హంట్ వెతకడానికి టికెట్లు కొన్న వారికి వెబ్‌సైట్ ద్వారా వివరించనున్నారు.

ఎప్పుడు మొదలు..
ఆగస్టు 15న మొదటి ట్రెజర్ హంట్ బిగిన్ కాబోతుంది. దీని టికెట్ ప్రైజ్ 49 డాలర్లు కాగా, ఈ ట్రెజర్ హంట్ గెలుచుకుంటే.. దాదాపు 4 వేల డాలర్ల విలువైన ట్రెజర్.. విజేత సొంతం కానుంది. అయితే ఈ టికెట్లు ఆల్రెడీ అయిపోగా, మరో హంట్ సెప్టెంబర్ 13న స్టార్ట్ అవుతుందట. దీని విలువ 7వేల డాలర్లు కాగా.. టికెట్ ధర 59 డాలర్లు.

కండిషన్స్..
ట్రెజర్ హంట్ పార్టిసిపెంట్స్ తమకు ఇచ్చిన క్లూ‌స్‌ను సోషల్ మీడియాలో కానీ, ఇతరులతో కానీ షేర్ చేసుకోకూడదు. అలా చేస్తే వాళ్లు గేమ్ నుంచి డిస్ క్వాలిఫై అవుతారు. అంతేకాదు, వారిపై చట్టపరంగా యాక్షన్ కూడా తీసుకుంటారట. జానీ దాచిపెట్టిన అన్నింటికీ జీపీఎస్ ట్రాకర్స్ అమర్చాడు. ఎవరైనా దాన్ని ముట్టుకున్నా.. బయటకు తీసినా.. తనకు ఈజీగా తెలిసిపోతుందని వివరించాడు. ఈ కొవిడ్ సంక్షోభంలో ప్రజలకు ఓ ఉత్సాహవంతమైన రియల్ అడ్వెంచర్ గేమ్‌ను అందించడంతో పాటు వారికి సంపదను కూడా ఇవ్వడం తన ఉద్దేశమని జానీ తెలిపారు.



Next Story