పబ్‌లో మందు తాగొచ్చు కాని క్రికెట్ ఆడొద్దా?

by  |
పబ్‌లో మందు తాగొచ్చు కాని క్రికెట్ ఆడొద్దా?
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న వేళ క్రీడలన్నీ నిలిచిపోయాయి. ప్రతి దేశంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రపంచం ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించి ప్రజా జీవనానికి ఆటంకం లేకుండా చేస్తున్నారు. ఇంగ్లండ్ ప్రభుత్వం కూడా తాజాగా లాక్‌డౌన్ నిబంధనలు సడలించింది. మాల్స్, పబ్స్, హోటల్స్, రెస్టారెంట్లు అన్నీ తెరుచుకున్నాయి. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇక రేపు ఉదయం 6 గంటలకు నేను పబ్‌కు వెళ్లొచ్చు. కావలసినంత మందు తాగొచ్చు. లోపల ఎంత మంది ఉన్నా పర్లేదు. కానీ, బయట క్రికెట్ మాత్రం ఆడకూడదు. ఇదెక్కడి చెత్త ఆలోచనో నాకు అర్థం కావడం లేదు’ అని వాన్ మండిపడ్డాడు. కాగా, వాన్ ట్విట్టర్ పోస్టును కొందరు సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ‘నిజమే వాన్, ఇది సరైన నిర్ణయం కాదు’ అని కొందరు రిప్లై ఇవ్వగా ఈ సమయంలో కూడా క్రికెట్‌ గురించి ఆలోచిస్తున్నావా అని మరికొందరు మండిపడ్డారు.

Next Story