దూసుకుపోతున్న..యాంటీ ఫేస్‌బుక్ ‘MeWe’ యాప్

by  |
దూసుకుపోతున్న..యాంటీ ఫేస్‌బుక్ ‘MeWe’ యాప్
X

దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ తీసుకున్న ‘ప్రైవసీ పాలసీ’ నిర్ణయం..ఆ సంస్థకు ఊహించని షాక్ ఇవ్వడంతో పాటు, తమ యూజర్లు వాట్సాప్ డిలీట్ చేసి, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వాట్సాప్‌ సంస్థను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్‌ను కూడా యూజర్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రైవసీగా ప్రాధాన్యమిచ్చే యాప్‌లకు లాగిన్ అవుతున్నారు. ఆయా యాప్‌ల పట్ల అసంతృప్తి చెందిన వరల్డ్‌వైడ్ యూజర్స్ ఫేస్‌బుక్, ట్విట్టర్‌ను విడిచిపెట్టి, ప్రైవసీ ఫస్ట్ సోషల్ నెట్‌వర్క్ మీవీ(MeWe)ను డౌన్‌లోడ్ చేస్తున్నారు. ఈ యాప్ యాంటీ ఫేస్‌బుక్‌గా పేరొందింది.

దిగ్గజ కంపెనీలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌ తమ యూజర్ల స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తిని హరించడంతో పాటు డేటా సెక్యూరిటీపై తీసుకున్న నిర్ణయాలు సబబు కాదని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఘాటుగానే స్పందించగా, ఆయా సంస్థలు యూజర్లపై నిఘా పెంచడం, రాజకీయకోణంలో టార్గెట్ చేయడం, న్యూస్ ఫీడ్‌‌ను మ్యానిప్యులేషన్ చేయడంతో యూజర్లు ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లకు స్విచ్ అవుతున్నారు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన సోషల్ మీడియా నెట్ వర్క్ మీవీకి వారంలోనే 2.5 మిలియన్ల మెంబర్స్ కొత్తగా వచ్చి చేరారు. దాంతో గూగుల్ ప్లే స్టోర్ డౌన్ లోడింగ్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచింది. మీవీని 2016లో లాంచ్ చేయగా, అక్టోబర్ 2020 నాటికి 9 మిలియన్ల యూజర్లు రాగా, ప్రస్తుతం 15.5మిలియన్స్ కస్టమర్స్ ఉన్నారు. ఇది హాంకాంగ్‌లో టాప్ సోషల్ యాప్‌గా కొనసాగుతోంది. మీవీకి యూజర్లు పెరగడానికి ప్రధాన కారణం ‘డేటా ప్రైవసీ’. ఇందులో యూజర్లను ఏ విధంగా టార్గెట్ చేయరు, యాడ్స్ కూడా ఉండవు, న్యూస్ ఫీడ్ మ్యానిప్యులేషన్ అసలుండదు. యూజర్లకు ఎంతో సౌకర్యంగా ఉన్న ఈ యాడ్ ఫ్రీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం త్వరలోనే ప్రపంచంలో నెం.1 యాప్‌గా నిలుస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed