ముంచుకొస్తున్న వాయుగుండం.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

by  |
ముంచుకొస్తున్న వాయుగుండం.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. తౌక్టే తుపాను గుజరాత్ తీరం వైపు కదులుతూ బలపడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇప్పటికే భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసింది. దాంతో కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంత రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. జాలర్లు జాగ్రత్తగా ఉండాలని, సరిహద్దు దగ్గర ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హెచ్చరికలు జారీ చేసింది. తౌక్టే తుపాను నేపథ్యంలో కేరళలో రెడ్ అలర్ట్ జారీ అయ్యింది.

కేరళతో పాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. ఈ అల్ప పీడనం బలపడి మే 16 నాటికి తుపాను గా, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపానుగా రూపాంతం చెందే అవకాశం ఉందని, దీని కారణంగా గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తదితర ప్రాంతాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో నేడు ఉరుములు, మెరుపులతో ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలని కోరింది.

Next Story