రాజ్యసభ ఆఫర్‌పై మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఇదే

92
CM Jagan, Megastar Chiranjeevi

దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఆఫర్ చేసిందంటూ వస్తున్న వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. రాజ్యసభ, రాజకీయ పదవులు తనకు రావని చెప్పుకొచ్చారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడిన చిరంజీవి తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. చిరంజీవిని వైసీపీ ప్రభుత్వం రాజ్యసభకు పంపబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని చెప్పారు. ఇలాంటి ఆఫర్లకు తాను లోబడే వ్యక్తిని కాదని.. అయినా తన వద్దకు రావని చిరంజీవి ప్రకటించారు. ఇకపోతే చిరంజీవి దంపతులు కృష్ణా జిల్లా డోకిపర్రులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్నారు. ప్రముఖ బిజినెస్‌మేన్ మెగా కృష్ణారెడ్డి ఇంట్లో జరుగుతున్న గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి దంపతులు డోకిపర్రు వెళ్లిన సంగతి తెలిసిందే.