వరుణ్‌ తేజ్‌తో గొడవపెట్టుకున్న చిరంజీవి.. వీడియో వైరల్

84

దిశ, సినిమా : టాలీవుడ్ సెలబ్రిటీలందరూ సంక్రాంతి సంబరాలను కుటుంబ సభ్యుల నడుమ జరుపుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఒకేచోట చేరి సందడి చేస్తోంది. అయితే ఈ సందర్భంగానే చిరు, వరుణ్‌తేజ్ మధ్య ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను వరుణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

అసలు ఏం జరిగిందంటే..  ఈ ఉదయం అందరికీ దోసెలు వేయాల్సిన బాధ్యతను వరుణ్‌, చిరంజీవికి అప్పగించారు. ఇద్దరూ దోసెలు వేస్తున్న క్రమంలో వరుణ్ వేసిన దోసెలు పర్‌ఫెక్ట్‌గా వచ్చాయి. కానీ మెగాస్టార్‌కు ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో.. చిన్నపిల్లాడిలా వరుణ్‌తో గొడవకు దిగాడు. ‘నాకు కుళ్లు వచ్చేసింది’ అంటూ వరుణ్ వేసిన దోసెను గరిటెతో చెడగొట్టాడు. కాగా ఈ ఫన్నీ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.