అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ.. మెగా రక్తదాన శిబిరం

by  |
అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ.. మెగా రక్తదాన శిబిరం
X

దిశ,కొత్తగూడెం: పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా ఇవాళ ఐఎంఎ ఫంక్షన్ హాల్ లో “మెగా రక్తదాన శిబిరాన్ని” ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులు వన్ టౌన్ సీఐ సత్యనారాయణ, 2టౌన్ సీఐ రాజు, త్రీటౌన్ సీఐ వేణుచందర్, జూలూరుపాడు సీఐ నాగరాజు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, కొత్తగూడెం సబ్ డివిజన్ లోని ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువకులు కూడా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఎస్పీ వెంకటేశ్వర బాబు మాట్లాడుతూ.. రక్తదానం మహాదానం అని, దీనిపై అపోహలు తొలగించుకోవాలని, రక్తదానం చేయడం ద్వారా మరింత ఆరోగ్యకరంగా మన శరీరం మారుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి, తదితర జబ్బులతో బాధపడుతున్న రోగులకు అత్యవసర పరిస్థితులలో రక్తాన్ని దానం చేయడం ద్వారా వారి ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధన కోసం యువత బాధ్యతగా వ్యవహరిస్తూ మెరుగైన సమాజం కోసం పాటుపడాలని సూచించారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసువారికి తెలియజేయాలని కోరారు. అనంతరం రక్తదానం చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, యువకులకు పండ్లు, జ్యూస్ అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

Next Story