తొలి, మలిదశ ఉద్యమకారుడు చిరంజీవికి ‘అల్లం’ జోహార్లు

121

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న డాక్టర్ కొల్లూరి చిరంజీవి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతో పాటు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మాజీ నక్సలైట్ కొల్లూరి మృతి పట్ల మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పందించారు.

‘తొలి తెలంగాణ ఉద్యమకారుడు, విప్లవ, బహుజన ఉద్యమాల గుండా పయనించి మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒకప్పటి నా నాయకుడు చిరంజీవికి జోహార్లు’ చెప్పారు. చంద్రక్క, అజిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తున్నట్లు అల్లం నారాయణ తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..