మక్కల కొనుగోలుకు నిధులు

by  |
మక్కల కొనుగోలుకు నిధులు
X

– జీవో విడుదల

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో ఈ రబీ సీజన్‌లో సాగైన మొత్తం 14.59లక్షల టన్నుల మక్కల(మొక్కజొన్న) కొనుగోలుకు మార్క్ ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్ ఫెడ్‌ను ఆదేశించింది. ఈ మక్కలను మద్దతు ధరను కొనుగోలుచేయడానికి అవసరమయ్యే రూ.3వేల2వందల13కోట్లకు ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మార్క్‌ఫెడ్‌కు ఈ నిధులు సమకూర్చనున్నాయి. రబీలో రాష్ట్రంలో ఈసారి 5.84లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. కరోనా వ్యాప్తి నిరోధించడానికి రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

Tags: telangana, markfed, maize procurement, funds release, g.o

Next Story

Most Viewed