కోరుట్లలో మాయావతి జన్మదిన వేడుకలు

79
Korutla-11

దిశ, కోరుట్ల: బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి 66వ జన్మదిన వేడుకలను శనివారం కోరుట్లలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పుప్పాల లింబాద్రీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఐదు రాష్ట్రాలలో బీఎస్పీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా 2023లో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, రైతు వ్యతిరేక విధానాలపై, నిరుద్యోగంపై పోరాటం చేస్తామన్నారు. ఈ   కార్యక్రమంలో బీఎస్పీ కోరుట్ల మండల అధ్యక్షుడు మారంపల్లి శ్రీధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సాజిద్, శ్రీనివాస్, నరేందర్, రాజు, లక్ష్మీనారాయణ, వినయ్, విష్ణుతేజ పాల్గొన్నారు.