మే1న నైపుణ్యాలపై శిఖరాగ్ర సమావేశం

by  |
మే1న నైపుణ్యాలపై శిఖరాగ్ర సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘21 వ శతాబ్దపు కార్యాలయ నైపుణ్యాల’పై శిఖరాగ్ర సమావేశాన్నిమే1న వర్చువల్ పద్దతిలో నిర్వహిస్తున్నట్లు టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ), ఎక్స్ బిలియన్ స్కిల్స్ ల్యాబ్, ఐక్యరాజ్యసమితి యంగ్ చేంజ్ మేకర్స్ కాన్క్లేవ్ (యుఎన్‌వైసీసీ) కలిసి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో గల విద్యార్థులంతా http://bit.ly/unycc_task వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

టాస్క్, యూఎన్‌వైసీసీ యొక్క ఫేస్‌బుక్‌ , యూట్యూబ్ ఛానెళ్లతో పాటు, టీసాట్ నిపుణ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందన్నారు. ముఖ్య వక్తలుగా నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, తెలంగాణ ప్రభుత్వ ఐటీఈసీ అండ్ ఇండస్ట్రీస్ విభాగం ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రసంగిస్తారని తెలిపారు. వికాస్ గుప్తా (మేనేజింగ్ డైరెక్టర్ – టాలెంట్, డెలాయిట్), రేణుకా బోడ్లా (హెడ్, నోవార్టిస్ బయోమ్ ఇండియా), విజయ మోహనా రెడ్డి (చీఫ్ ఆఫ్ స్టాఫ్ / స్ట్రాటజిస్ట్ – ఐటీ, డెల్), కౌశిక్ శ్రీనివాసన్ (మేనేజింగ్ డైరెక్టర్, కాన్ అసోసియేట్స్) మరియు భువనేశ్వరి చెరువు (చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఆర్టియన్) ఈ అంశాలపై మాట్లాడతారని వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Next Story

Most Viewed