కోదాడ మున్సిపాలిటీలో అవినీతి కంపు.. చైర్ పర్సన్‌పై ఎమ్మెల్యే బొల్లం ఆగ్రహం

by  |
Husband of Kodada Municipal Chairman
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో కమాటీల నుంచి డ్రైవర్ల వరకు జరుగుతోన్న నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు మున్సిపాలిటీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కాగా, కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు ఒక్కొక్కరు ఇద్దరు చొప్పున కమాటీలను అవుట్ సోర్సింగ్ పద్దతిలో నియమించుకున్నారు. ఇందుకోసం ఒక్కొక్క కమాటీ నుండి సుమారు రెండు లక్షల యాభైవేల వరకూ వసూలు చేసినట్లు సమచారం. ఇందులో సుమారు రూ.70 వేల వరకు మున్సిపల్ చైర్ పర్సన్‌ భర్తకు ముట్టినట్లు సమాచారం. అంతేగాకుండా.. డ్రైవర్ల నియామకంలో సైతం భారీ మొత్తంలో నగదు చైర్ పర్సన్‌ భర్త వసూలు చేసినట్టుగా చర్చ కొనసాగుతోంది.

అయితే, ఈనోటా.. ఆనోటా ఈ విషయం కాస్త కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే బొల్లం చైర్ పర్సన్‌‌పై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఓవైపు అవినీతి రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలనుకుంటోన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంతమంది నాయకులు చేస్తోన్న అవినీతి వల్ల వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్వయంగా పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. అవినీతి నేతలపై ఎమ్మెల్యే బొల్లం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్య నాయకులు అంటున్నారు.

మున్సిపాలిటీ సమావేశంలో పట్టణ అధ్యక్షులు కీ రోల్

ఇదిలా ఉండగా, మున్సిపాలిటీ చైర్మన్ డబ్బులు తీసుకున్నారా? అనే విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో చైర్ పర్సన్‌‌పై ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మున్సిపాలిటీ అత్యవసర సమావేశంలో కోదాడ పట్టణ అధ్యక్షులు కీ రోల్‌గా వ్యవహరిస్తున్నారు. అంతేగాకుండా.. అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్ పర్సన్‌‌ను తొలగిస్తారా? భవిష్యత్తులో చైర్ పర్సన్‌ మార్పు ఉంటుందా? అనే చర్చ కోదాడ వ్యాప్తంగా జరుగుతోంది.

Next Story

Most Viewed