గల్గామ్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు హతం

by  |
Massive encounter
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గుల్గామ్ అటవీ ప్రాంతంలో మంగళవారం కాల్పుల మోత మోగింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. ఇరు వర్గాల మధ్య సుమారు 45 నిమిషాలపాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. పోలీసుల వివరాల ప్రకారం… ఊసూరు పోలీస్‌స్టేషన్ పరిథిలోని ఊసూరు – గుల్గామ్ గ్రామాల మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన 196 బెటాలియన్‌కి చెందిన జవాన్ మిత్లేష్ కుమార్‌‌కి తోటి జవాన్లు ఊసూరులో చికిత్స చేయించి బీజాపూర్ తరలించారు. ఆ జవాన్ నడుములో బుల్లెట్ దిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ కాల్పుల సమయంలో నాడ్పల్లి నివాసి కొట్టం సోమ అనే పౌరుడు గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ను ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు.

Next Story