2017లో కులాంతర వివాహం.. వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతామంటూ ప్రేమజంట హల్‌చల్

by  |
2017లో కులాంతర వివాహం.. వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతామంటూ ప్రేమజంట హల్‌చల్
X

దిశ, వెబ్‌డెస్క్ : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లు అంగీకరించకపోయినా 2017లో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే, ఈ ప్రేమజంట వాటర్ ట్యాంక్ ఎక్కి కిందకు దూకుతామంటూ హల్ చల్ చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ దగ్గర బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కులం పేరుతో దూషిస్తూ తమను అవమానించడమే కాకుండా, దాడి చేశాడని ప్రేమజంట ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed