17 వాహనాలకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

by  |
17 వాహనాలకు నిప్పుపెట్టిన మావోయిస్టులు
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. కాంకేర్ జిల్లా ధనోరా పోలీస్ స్టేషన్ పరిథిలోని కేష్కల్ ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న 17 వాహనాలకు నిప్పుపెట్టారు. రహదారి పనులు ఆపాలని కార్మికులను బెదిరించారు. సుమారు 20 మంది సాయుధ నక్సల్స్ రోడ్డు నిర్మాణ పనుల దగ్గరకు వచ్చి ఉద్యోగులను హెచ్చరించారు.

పని చేస్తున్న కార్మికులకు వార్నింగ్ ఇచ్చి వాహనాలకు నిప్పు పెట్టి తగులబెట్టారు. పనులు కొనసాగిస్తే సంబంధిత కాంట్రాక్టర్‌ని హతమారుస్తామని నక్సల్స్ హెచ్చరించినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం ఘటన ప్రాంతానికి వచ్చిన వారిలో మహిళా నక్సల్స్ కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ధృవీకరించారు.

Next Story